Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?

Advertiesment
పెరుగును చేర్చుకుంటే.. నెయ్యి వాసన వస్తుందా..?
, మంగళవారం, 29 జనవరి 2019 (17:51 IST)
నిద్రలేమితో బాధపడుతున్నారా.. అయితే ఒక కప్పు పెరుగు తీసుకుని తలపై మాడుకు పట్టిస్తే హాయిగా నిద్రపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రించేందుకు రెండు గంటల ముందుగా మాడుకు పెరుగు రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుని.. మాడును ఆరనిచ్చాక.. నిద్రకు ఉపక్రమించాలి. ఇలా చేస్తే హాయిగా నిద్ర పడుతుంది. 
 
1. బెండకాయల్ని తాళింపు చేసేటప్పుడు ఒక స్పూన్ పెరుగు చేర్చితే జిడ్డు తొలిగిపోతుంది. అరటి పువ్వును పెరుగు కలిపిన నీటిలో వేసి ఉంచితే రంగు మారవు. కిరోసిన్ స్మెల్ పోవాలంటే పెరుగుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 
 
2. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని చేర్చి తీసుకోవచ్చు. పెరుగులో పంచదార చేర్చి తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
3. విరేచనాలకు ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. బిర్యానీ వంటివి తీసుకునేటప్పుడు ఉదరానికి ఎలాంటి రుగ్మతలకు ఏర్పడకుండా వుండేందుకే రైతాను ఉపయోగిస్తున్నారు. 
 
4. అలాగే మెనోపాజ్ దశకు చేరుకునే మహిళలకు పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పెరుగు అధిక క్యాల్షియాన్ని అందిస్తుంది. వెన్నను మరిగించి దించేటప్పుడు కాసింత పెరుగును చేర్చుకుంటే నెయ్యి వాసనగా ఉంటుంది. పులుపెక్కిన పెరుగుతో తలకు పట్టిస్తే శిరోజాలు మృదువుగా తయారవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి..?