Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

గోదావరిలో నిత్య అన్నపూర్ణి.. ఆమే డొక్కా సీతమ్మ..!

డొక్కా సీతమ్మ గురించి తెలియని తెలుగు వారంటూ వుండరు. జాతి, మత, కుల విభేదాలను పరిగణనలోకి తీసుకోకుండా కడుపునిండా అన్నంపెట్టిన నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ. ఈమె ఖండాంతర ఖ్యాతి గడించిన మహాతల్లి. తొమ్మిదేళ్ల

Advertiesment
Dokka Seethamma
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (15:28 IST)
డొక్కా సీతమ్మ గురించి తెలియని తెలుగు వారంటూ వుండరు. జాతి, మత, కుల విభేదాలను పరిగణనలోకి తీసుకోకుండా కడుపునిండా అన్నంపెట్టిన నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ. ఈమె ఖండాంతర ఖ్యాతి గడించిన మహాతల్లి. తొమ్మిదేళ్ల ప్రాయంలో సీతమ్మకు వివాహం జరిగింది. సీతమ్మ 1841లో మండపేటలో ఆనపిండి భవానీ శంకరం, దంపతులకు జన్మించారు. 
 
తొమ్మిదేళ్ల ప్రాయంలో సీతమ్మ వివాహం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్నతో జరిగింది. జోగన్నది వ్యవసాయ కుటుంబం. సీతమ్మ అన్నదాన తత్పరతను కలిగిన గొప్ప వ్యక్తి. గోదావరి వరదల సమయంలో గోదావరికి ఆవలి ఒడ్డున ఒక అన్నార్తుడు పిలిచి ''తల్లీ సీతమ్మ తల్లీ ఆకలి.. అన్నంపెట్టి రక్షించు తల్లీ.. అని అరిచాడు. వెంటనే సీతమ్మ పడవలో ఆవలి ఒడ్డుకు చేరుకుని అతని ఆకలి తీర్చారు. 
 
ఓసారి ఆమె అంతర్వేది తీర్థానికి పల్లకీలో వెళ్తుండగా.. కొంత దూరం వెళ్లేసరికి బోయీలు అలసట తీర్చుకునేందుకు ఆగారు. అక్కడికి వచ్చిన ఓ పెళ్ళి బృందంలో ఓ పాప ఏడుస్తుంటే.. కొద్దిసేపు ఓపిక పడితే సీతమ్మ తల్లి ఇంటికి చేరుకుంటారు. ఆ తల్లి మీ ఆకలి తీస్తుందని అంటే... ఆ మాటలు విని అంతర్వేది యాత్రను రద్దు చేసుకుని ఇంటికెళ్లి.. ఆ పెళ్లి బృందానికి కడుపునిండా అన్నం పెట్టిన అన్నదాత డొక్కా సీతమ్మ. ఆమె నిరంతర అన్నదానం గురించి విని బ్రిటీష్ చక్రవర్తి 1903లో బ్రిటీష్ చక్రవర్తిగా ఏడవ ఎడ్వర్డు పట్టాభిషేకానికి రావాల్సిందిగా సీతమ్మను ఆహ్వానించారు. 
 
అయితే ఆమె సగౌరవంగా తిరస్కరించారు. కానీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా చక్రవర్తి సింహాసనం పక్కనే మరో సింహాసనం ఏర్పాటు చేసి ఆమె చిత్రపటాన్ని పెట్టి గౌరవించారు. ఆమె చిత్రపటానికి నమస్కరించి.. ఏడో ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేయించుకున్నారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ గవర్నర్ జనరల్ ద్వారా బ్రిటీష్ చక్రవర్తి ప్రశంసాపత్రాన్ని పంపారు. 1909లో ఆమె స్వర్గస్తురాలయ్యారు. 
webdunia
 
ఆంగ్లేయులు పాలిస్తున్న కాలంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలన్నీ బండ్ల మీద సాగుతూ వుండేవి. గమ్యం చేరుకునేందుకు కొన్ని రోజులు పట్టేది. మార్గంలో ఆహారాలు లభించక చిన్నాపెద్దలు ఇబ్బందులు పడేవారు. సత్రాలు పేకాట రాయుళ్లకో, వ్యసన పరులకో సరిపోయేది. ఇక ఆకలికి అలమటించిపోయే వారికి సీతమ్మ.. కడుపారా అన్నం పెట్టేది. అలాంటి కాలంలో అన్నపూర్ణగా, నిరతాన్నదాత్రిగా కీర్తి గడించింది. ప్రతీ సంవత్సరం డొక్కా సీతమ్మగారికి బ్రిటీష్ చక్రవర్తి నుంచి పట్టాభిషేక ఆహ్వానాలు అందాయట. ఇది భారతదేశంలో మరెవ్వరికీ దక్కని అరుదైన గౌరవం. 
 
1908లో సీతమ్మగారికి 68 ఏళ్ల వయస్సులో చేతిమీద కేన్సర్ వచ్చింది. ఆ రోగానికి వైద్యం చేయించుకోకుండానే ఆమె తుది శ్వాస విడిచారు. అంతేగాకుండా తనకు తర్వాత నిత్య అన్నదానం జరిగి తీరాలని ప్రమాణం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28, 1909 వైశాఖ శుద్ధ నవమి, బుధవారం నాడు, మధ్యాహ్నం 12 గంటలకు సీతమ్మగారు లంకల గన్నవరంలో ప్రాణాలు విడిచారు. అదే సమయంలో దగ్గరలోని ఇందుపల్లి గ్రామంలో శ్రీ మంథా నరసింహ మూర్తిగారి ఇంటి వద్ద శ్రీ కాలనాథభట్ల వెంకయ్యగారు పఠాను ఏకపాత్రాభినయం చేస్తుండగా, మహా పండితులు శ్రీ. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు ఆ ఏకపాత్రాభినయాన్ని చూసి ఆనందిస్తున్నారు. 
 
ఇంతలో ఆకాశంలో ఓ గొప్ప తేజస్సు పడమర నుంచి తూర్పుకు ఒక గుండ్రని బంతిలా అమితమైన వేగంతో వెళ్లడం చూసి.. ఎవరో గొప్ప వ్యక్తి మరణించారని శాస్త్రి గారు అన్నారు. కొద్దిసేపటికే డొక్కా సీతమ్మగారు చనిపోయారనే వార్త దావానంలా వ్యాపించింది. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సుబ్బారాయుడు గారు అన్నదాన వ్రతాన్ని కొనసాగించారు. ఆపై వారి తరం వారు కూడా డొక్కా సీతమ్మ సేవలను గుర్తిస్తూ.. నిత్య అన్నదానాన్ని కొనసాగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరి పొడిలో గుడ్డు తెల్లసొనను కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?