Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లైంగికంగా ముగ్గురు వేధిస్తున్నారు... ఆత్మహత్య చేసుకోబోయి అమ్మను కాల్చి చంపేశా...

మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన చరియా జాక్సన్ అనే మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. అభంశుభం తెలియని వయసులోనే తను లైంగిక వేధింపులకు గురయ్యాననీ, తనపై కుటుంబంలోని ముగ్గురు వ్యక

లైంగికంగా ముగ్గురు వేధిస్తున్నారు... ఆత్మహత్య చేసుకోబోయి అమ్మను కాల్చి చంపేశా...
, మంగళవారం, 16 మే 2017 (16:41 IST)
మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన చరియా జాక్సన్ అనే మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. అభంశుభం తెలియని వయసులోనే తను లైంగిక వేధింపులకు గురయ్యాననీ, తనపై కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడులు చేసేవారిని ఆమె వాపోయింది. చిన్న వయసులో తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి తల్లికి చెప్పాలంటే భయపడేదాన్ననీ, అందువల్ల ఆ బాధను అలాగే కొన్నేళ్లు భరించానని చెప్పుకొచ్చింది. 
 
ఐతే 12 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ ఈ లైంగిక దాడి నుంచి ఎలాగో తను తప్పించుకోవాలని ప్రయత్నం చేశాననీ, ఆ క్రమంలో ఇంట్లో వున్న రివాల్వర్ తీసుకుని దానితో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించింది. ఐతే అనూహ్యంగా ఆ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కగానే ఆ బుల్లెట్ తనకు బదులుగా తన తల్లికి తగిలి ఆమె చనిపోయిందనీ, దానితో తనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారని వెల్లడించింది. 
 
కోర్టు అడిగిన ప్రశ్నలకు వేటికీ తను సమాధానం చెప్పకపోవడంతో తనను బాలనేరస్తుల కారాగారానికి తరలించారని పేర్కొంది. అక్కడ తనకు పలువురు మానసిక వైద్యులు చికిత్స ఇచ్చారనీ, ఆ క్రమంలో 15 ఏళ్లు వయసు వచ్చాక తను ఎలాంటి దారుణమైన లైంగిక దాడులకు గురయ్యానోనన్న విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పింది. అలా శిక్షా కాలంలో తను ఓ నాయకురాలిగా తయారయ్యాననీ, జైలుకు వచ్చే ఎందరో మహిళల సమస్యలపై క్షుణ్ణంగా తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చేదాన్ననని వెల్లడించింది. 
 
12 ఏళ్ల సమయంలో జైలుకు వెళ్లిన ఆమె 21 ఏళ్ల నాటికి శిక్షా కాలం ముగిసి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒంటరి జీవితం ఎలా గడపాలా అని ఎదురుచూస్తుండగా ఓ టెలివిజన్ ఛానల్ హోస్ట్ గా తనకు అవకాశం వచ్చిందనీ, ఇక అక్కడ్నుంచి తను వెనుదిరిగి చూసే అవకాశమే లేకుండా పోయిందని చెప్పింది. సమస్యలకు భయపడి తనలా ఆత్మహత్య యత్నం చేయకూడదనీ, సమస్యపై పోరాటం చేయడం నేర్చుకోవాలని ఆమె తన సందేశాన్ని ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీళ్ళ నొప్పులను దూరం చేసే ఆవనూనె.. ఎలాగంటే?