సంతకం ఎలా చేయాలీ..? ఎలా చేయకూడదు..?
ఒక్కో సంతకంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంతకాన్నిబట్టి ఆయా వ్యక్తుల మనస్తత్వాలను తెలుసుకోవచ్చంటారు మనస్తత్వ శాస్త్ర నిపుణులు. అదలా వుంచితే.. అసలు సంతకం ఎలా చేయాలి... ఎలా చేయకూడదో ఒకసారి చూద్దాం.* సంతకంలో ఏ అక్షరానికీ కూడా ముందు అక్షరం కంటే తక్కువ బేస్ లైన్ ఉండకూడదు. * సంతకంలో చివరి అక్షరం ఎప్పుడూ స్పష్టంగా, పెద్దదిగా, పొందిగ్గా ఉండాలి. * సంతకంలోని మరే ఇతర అక్షరానికీ ఏ అక్షరమూ ఎటువంటి నీడ ఉండకూడదు. * ఒకవేళ సంతకంలో అండర్‌లైన్ ఉంటే అది వెనక్కు వచ్చి వెళ్లక, కుడి నుంచి ఎడమవైపుకు గీయాలి. * ఏ అక్షరాన్ని స్ట్రోక్‌తో కట్ చేయకూడదు. * సంతకం చివరగానీ, మధ్యలో కానీ చుక్కలు పెట్టకూడదు. ఈ చుక్కలు పెట్టడం వల్ల ఎదుగుదలను అడ్డగించినట్లవుతుంది. సంతకం కింద చుక్కలు బావుంటాయి. * i, j అక్షరాలపై చుక్కలు అక్షర శిఖరానికి వీలయినంత దగ్గరగా ఉండాలి. ఇది జాగ్రత్తతో వ్యవహరించే వైఖరిని ప్రతిబింబిస్తుంది. * సంతకం పొడవుగా ఉన్నట్లయితే ఆదాయాన్ని పట్టి ఉంచగలరు. * తొలి అక్షరం కనిపించే విధానాన్ని బట్టి మీరు ఎంత ప్రేమపూరితులన్న సంగతిని తెలుసుకోవచ్చు. ఆకర్షణీయమైన తొలి అక్షరం వ్యక్తిత్వంలోని వశీకరణకు సూచన.