Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల్లో సెక్స్ పవర్‌కు "వయాగ్రా" పిల్

Advertiesment
వయగ్రా
WD
ఇప్పటివరకూ పడకగదిలో సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకునేందుకు పురుషులకు మాత్రమే వయగ్రా మాత్రలు లభ్యమవుతూ వస్తున్నాయి. ఈ పవర్ పిల్స్ త్వరలో మహిళలకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

మహిళలు తమ సెక్స్ పవర్‌ను పెంచుకునేందుకు రోజా రంగులో ఉండే వయగ్రా మాత్రలు ఉపయోగపడతాయంటున్నారు. ప్రయోగాలన్నీ ముగిసిన అనంతరం ఈ మాత్రలను మహిళలకు సిఫార్సు చేసేందుకు ఆహార, ఔషధాల నిర్వహణ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ మాత్రలను అమ్మేందుకు జర్మనీ ఫార్మా కంపెనీల్లో ప్రముఖ కంపెనీ ఒకటి అమితమైన ఆసక్తిని చూపుతోంది. "ఫిల్బాసెరిన్"గా పిలిచే ఈ మాత్ర మహిళ మెదడులో సెక్స్ కోర్కెలను రేపి భాగస్వామితో శృంగారాన్ని నెరపేందుకు ఆజ్యం పోస్తుంది.

అయితే ఈ మాత్రను మార్కెట్లో విడుదల చేయాలని వస్తున్న విన్నపాల దృష్ట్యా ఆరోగ్య, ఔషధాల నిర్వహణ కమిటీ జూన్ 18న సమావేశం కానుంది. ఈ సమావేశంలో మాత్రలను బహిరంగ మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలావుండగా ఈ బిళ్లలపై వాషింగ్టన్‌లోని మహిళా ఆరోగ్య సంస్థ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సుఖమైన, ఆరోగ్యకరమైన సెక్స్ జీవితాన్ని ఆస్వాదించే అవకాశం మహిళకు కల్పించడం అభినందించదగ్గదే అయినప్పటికీ ఈ మాత్రలు వారి ఆరోగ్యంపై ఎటువంటి దుష్ఫలితాలను చూపెడతాయన్నదానిపై పూర్తిగా నిగ్గు తేల్చాలని కోరింది. హానిరహితమైనవని తేలిన తర్వాతే ఈ మాత్రల విక్రయానికి అనుమతివ్వాలని సూచించింది.

గతంలో ఇటువంటి వయగ్రా మాత్రలు ఎన్నో వచ్చినప్పటికీ, మహిళల ఆరోగ్యంపై అవి దుష్ఫలితాలను చూపుతాయన్న కారణంతో వాటిని మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ ఈసారి ఈ కొత్త వయగ్రా బిళ్లలు మాత్రం మహిళలకు అందుబాటులోకి వచ్చి తీరుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu