గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కృష్ణంరాజును హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు.
webdunia
కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు.
1966లో వచ్చిన 'చిలకా గోరింక' ఆయన తొలి సినిమా.
'అవే కళ్లు' సినిమాలో విలన్‌గా చేశారు.
1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు.
webdunia
1986లో వచ్చిన 'తాండ్ర పాపారాయుడు' సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు.
భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
webdunia
మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య తదితర 187 సినిమాల్లో నటించారు.