సిల్వర్ స్క్రీన్ పైన వెలిగి రాలిపోయిన సిల్క్ స్మిత

సిల్క్ స్మిత అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే పేరుంది. సిల్క్ స్మిత పుట్టినరోజు డిశెంబరు 2, 1960. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము.

credit: twitter

స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి, ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జన్మించారు.

స్మిత కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో 4వ తరగతి వద్దే చదువు ఆపేసారు.

స్మిత అందంగా వుండటంతో ఆమెను పెళ్లాడుతామంటూ చాలామంది వెంటపడేవారు.

ఫలితంగా తల్లిదండ్రులు ఆమెకి చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు.

ఐతే భర్త, అత్తమామలు సాధింపు కారణంగా స్మిత ఇంటి నుంచి పారిపోయారు.

టచ్ అప్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టి క్రమంగా హీరోయిన్ స్థాయికి ఎదిగారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా మొత్తం 450 చిత్రాల్లో నటించారు.

1996 సెప్టెంబరు 23న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు, ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది.

సమంత ఆరోగ్యం ఆందోళనకరంగా వుందా?

Follow Us on :-