చిలకడదుంప. చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం వలన మంచి ప్రయోజనాలుంటాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
చిలగడదుంపల్లో పీచు చాలా ఎక్కువ వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.
చిలగడదుంపల్లో వుండే విటమిన్ బీ6 గుండె, రక్తనాళాల సమస్యలకు దూరంగా వుంచుతాయి.
ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, అధిక రక్తపోటును తగ్గించటంలో చిలకడ దుంపల్లోని పొటాషియం మేలు చేస్తుంది.
చిలగడదుంపల్లోని విటమిన్ ఎ, బీటా కెరటిన్ ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడటమే కాక చూపు తగ్గిపోకుండా చూస్తుంది.
మాంగనీసు ఈ దుంపల్లో వుండటంతో ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి.
ఈ దుంపల్లోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచితే, విటమిన్ ఇ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.