అనుపమా పరమేశ్వరన్. తాజాగా టిల్లూ స్క్వేర్ చిత్రంతో హిట్ కొట్టింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాదులో జరిగింది. ఆ సమయంలో ఆమె మాట్లాడబోతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త అవమానించారట.
credit: Instagram and webdunia
టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు.
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తనకు దక్కిన సక్సెస్ గురించి చెప్పేందుకు స్టేజిపైకి ఎక్కి మాట్లాడాలనుకున్నది.
ఐతే మైకు అందుకుని మాట్లాడుతూ వుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను మాట్లాడొద్దంటూ గావుకేకలు పెట్టారు.
ఎన్టీఆర్ స్టేజిపైకి వచ్చి మాట్లాడాలంటూ గోల చేస్తుండటంతో అనుపమ స్టేజి దిగి వెళ్లిపోబోయింది.
ఇంతలో యాంకర్ సుమ రెండు ముక్కలైనా మాట్లాడాలని అభ్యర్థించారు.
దీనితో మరోసారి పరమేశ్వరన్ మాట్లాడేందుకు ప్రయత్నించబోగా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరిచారు.
చేసేది లేక టిల్లు హీరోయిన్ ఖిన్నురాలై స్టేజి దిగి వెళ్లిపోయిందట.