నటి, మంత్రి ఆర్కే రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు

నటి, ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాము.

credit: twitter

రోజా 17 నవంబర్ 1972న తిరుపతిలో జన్మించారు.

శ్రీ పద్మావతి యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్సులో డిగ్రీ చేసారు.

రాజేంద్రప్రసాద్ హీరోగా ప్రేమతపస్సు చిత్రంతో రోజా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

తమిళ చిత్ర పరిశ్రమకు చామంతి చిత్రంతో దర్శకుడు సెల్వమణి ఆమెను పరిచయం చేసారు.

మలయాళ, తమిళ, తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించారు.

1999లో తెలుగుదేశం పార్టీలో చేరి, తెలుగు మహిళా అధ్యక్ష పదవిలో వున్నారు.

2002లో దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు.

2009 ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

తెదేపా నుంచి బైటకొచ్చి వైసిపిలో చేరారు, 2014లో నగరిలో పోటీ చేసి విజయం సాధించారు.

ప్రస్తుతం ఏపీ పర్యాటక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చౌకైన ఎలక్ట్రిక్ కారు: 160 కిమీ మైలేజ్, ధర ఎంతో తెలుసా?

Follow Us on :-