రక్తంలో ఇన్ఫెక్షన్ సహజసిద్ధంగా నయం చేసుకోవడం ఎలా?

రక్తస్రావం రుగ్మతలకు అనేక కారణాలు ఉన్నాయి. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఈ రక్తస్రావం రుగ్మతలు రాకుండా సహజసిద్ధ పద్ధతులను అవలంభిస్తే మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

ఉసిరి, నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, బ్రోకలీ మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తింటుండాలి.

పాలు, చేపలు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ఉదయం ఎండలో కూర్చోవాలి.

పెరుగు, మజ్జిగ, పచ్చళ్లు మొదలైన ప్రోబయోటిక్స్‌ను తింటుండాలి.

పసుపు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బీన్స్, బీట్‌రూట్ మొదలైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలి.

క్యారెట్, బచ్చలికూర, అరటిపండ్లు, చిలగడదుంపలు, వేరు కూరగాయలు, ఆకుకూరలు వంటి బీటా-కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

అవోకాడో, గింజధాన్యాలు వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

యాపిల్ వెనిగర్, వేప కషాయం, వెల్లుల్లి, అల్లం, పసుపు, కలబంద వంటివి ఉపయోగించాలి.

రోజూ తగిన మోతాదులో గోరువెచ్చని నీరు త్రాగాలి, క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

వెల్లుల్లి పాల పాయసం తాగితే ఏమవుతుంది?

Follow Us on :-