వెల్లుల్లి పాల పాయసం తాగితే ఏమవుతుంది?

కొవ్వు శరీరంలో పేరుకుపోతే గుండె సమస్యలు ఎక్కువవుతాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే రక్త ప్రసరణ మార్గం చిన్నదవుతుంది. దీనినే ఎథిరోస్క్లైరోసిస్ అంటారు. ఇదిలాగే సాగితే శరీరంలో సమస్త భాగాలకు జరిగే రక్తసరఫరాలో సమస్యలు వస్తాయి. దీని నుంచి బైటపడే చిట్కా ఏమిటో తెలుసుకుందాము.

webdunia

కొవ్వును పారదోలి గుండె సమస్యలు రాకుండా వుండాలంటే ఈ క్రింది చిట్కా పాటిస్తే మేలు చేకూరుతుంది.

వెల్లుల్లిని పాలలో ఉడికించి పాయసం (రసోనా క్షీరం) తయారుచేసుకుని తాగినా ప్రయోజనం వుంటుంది.

ఈ పాయసం తయారుచేసే పద్ధతి ఎలాగో తెలుసుకుందాము.

ఐదు గ్రాముల వెల్లుల్లి రేకులు తీసుకుని దాని పైపొట్టును తొలగించాలి.

వీటిని 50 మిల్లీలీటర్ల పాలల్లో 6 గంటలపాటు నానబెట్టాలి.

ఆ తర్వాత వాటిని తీసి 200 మిల్లీలీటర్ల పాలలో వేసి సగానికి సగం తగ్గేదాకా మరిగించాలి.

ఆపై వడబోసి నేరుగా కానీ, మధుమేహం లేనివారైతే చక్కెర కలిపి కానీ రోజూ రాత్రివేళ నిద్రపోయే ముందు సేవించాలి.

ఇలా చేస్తే ధమనులు గట్టిపడి గుండె సంబంధమైన సమస్యలు రావు.

గమనిక: చిట్కాలు పాటించే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.

అరోమాథెరపీ ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Follow Us on :-