ఆయుర్వేద జలం అంటే ఏంటి? దీనిని తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటి?

ఆయుర్వేద జలం. బరువు తగ్గాలంటే అందుకు తోడ్పడే ఆయుర్వేద చిట్కాలులో ఇది ఒకటి. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించే ఈ జలాన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము.

credit: social media

కావలసిన పదార్థాలు- ధనియాలు అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, సోంపు అర టీ స్పూను, కాచిన నీళ్లు 4 కప్పులు.

మరిగే నీళ్లలో ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి నాననివ్వాలి.

కొద్దిసేపటి తర్వాత వడగట్టి వాటిని కాస్త విరామంతో రోజంతా తాగుతూ వుండాలి.

ఇలా తాగుతున్న ఆయుర్వేద జలం శరీరంలోని మలినాలను బయటకు వెళ్లగొడుతుంది.

జీర్ణక్రియను సరిచేసి మెటబాలిజంను పెంచుతుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

శరీరంలో నీరు నిల్వ వుండకుండా చూస్తుంది. శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఆరోగ్యానికి సంబంధించి ఈ టెస్టులు ఎందుకు చేస్తారో తెలుసా?

Follow Us on :-