ఆరోగ్యానికి సంబంధించి ఈ టెస్టులు ఎందుకు చేస్తారో తెలుసా?
దేహంలోని అవయవాలులో ఎక్కువగా గుండె, మెదడు, లివర్, థైరాయిడ్, కిడ్నీస్.. చెందిన సమస్యలు ఇటీవలికాలంలో ఎక్కువవుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నిర్థారణకై ప్రత్యేకించి పరీక్షలున్నాయి. ఆ పరీక్షలు, వాటి గురించి వివరాలను తెలుసుకుందాము.
credit: twitter
బ్లడ్ షుగర్ టెస్ట్: ఈ పరీక్ష ద్వారా శరీరంలో షుగర్ స్థాయిలను తెలుసుకోవచ్చు. సాధారణ స్థాయి 70mg/dl-100mgdl
లిపిడ్ ప్రొఫైల్: గుండె ఎలా పనిచేస్తోందనే పూర్తి సమాచారం ఈ పరీక్షలో తెలుస్తుంది. సాధారణ స్థాయి 200mg/dL కంటే తక్కువ.
ఈసీజి: ఈ పరీక్షతో గుండె సరిగా పనిచేస్తుందో లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
లివర్ ఫంక్షన్ టెస్ట్: లివర్ పనితీరును, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, ఫ్యాటీలివర్ వంటి సమస్యలు తెలుసుకోవచ్చు. సాధారణ స్థాయి- 0.1-0.2mg/dL
థైరాయిడ్ టెస్ట్: ఈ పరీక్ష ద్వారా థైరాయిడ్ హెచ్చుతగ్గులు తెలుసుకోవచ్చు. సాధారణ స్థాయి- 0.4-4.0 mIU/L
విటమిన్ డి టెస్ట్: కీళ్ల నొప్పులున్నవారు, ఎముకలు బలహీనంగా వున్నవారికి ఈ టెస్ట్ తప్పనిసరి. సాధారణ స్థాయి- 20-40ng/mL
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.