జామ పండును ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు. ఎందుకంటే ఈ పండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. జామ పండ్లు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
credit: social media
జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి.
విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది.
సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు.
జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
ఊబకాయంతో బాధపడేవారు రోజూ జామపండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.