మినుములుతో చేసిన పదార్థాలు తింటే మూత్రపిండాలకు ఏమవుతుంది?

మినుములు. వీటి పొట్టు తీసి మినప దోసెలు తినడం చేస్తుంటాము. ఐతే ఈ మినుములు లో పలు ఔషధ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

స్త్రీలకు, పురుషులకు నిండైన యౌవనదారుఢ్యాన్ని అందించడం మినుములు ప్రధానమైనవని ఆయుర్వేదం చెపుతుంది.

మినుములు శరీరానికి, మూత్రపిండాలకు బలం కలిగించి వాతరోగాలను పోగొడుతాయి.

మెత్తగా రుబ్బిన మినప పిండిని ఇడ్లీ పళ్లేలలో ఆవిరికుడుములుగా వేసి తింటే శరీరానికి బహు బలాన్నిస్తాయి.

మినపసున్నివుండలు తింటుంటే మేహవాత రోగాలు పోయి శరీరానికి బలాన్నిస్తాయి.

నల్లమినుములను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి తెల్లమచ్చలపై లేపనం చేస్తే క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి.

నల్లమినుములను నలగ్గొట్టి ఆ ముక్కలను నిప్పులపై వేసి వాటిపొగను పిలుస్తూ వుంటే అప్పటికప్పుడు ఎక్కిళ్లు తగ్గుతాయి.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

మామిడాకుల కషాయం ఉపయోగం ఏమిటో తెలుసా?

Follow Us on :-