శీతాకాలంలో మీ చర్మ సంరక్షణ చిట్కాలు

శీతాకాలంలో చలిగాలి వల్ల చర్మం పొడిబారి, పగిలిపోయే ప్రమాదం ఎక్కువ. ఈ సమయంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: Freepik and social media

చర్మం పొడిబారకుండా ఉండటానికి రోజుకు కనీసం రెండుసార్లు మాయిశ్చరైజర్ వాడాలి.

శరీరం లోపల నుండి హైడ్రేట్‌గా ఉండేలా మంచినీరు ఎక్కువగా తాగాలి.

షవర్‌లో వెచ్చని నీరు మాత్రమే వాడండి, ఎందుకంటే వేడి నీరు చర్మాన్ని పొడిబార్చుతుంది.

పెదవులు పగిలిపోకుండా ఉండటానికి లిప్ బామ్‌ను రోజూ వాడాలి.

చర్మాన్ని పొడిబార్చే సబ్బులను వాడకుండా, మృదువైన క్లీనర్స్‌ను వాడాలి.

రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖం కడుక్కోండి, చలికాలంలో ఎక్కువగా ముఖం కడుక్కుంటే చర్మాన్ని పొడిబార్చుతుంది.

శీతాకాలంలో కూడా సూర్యకాంతి చర్మానికి హాని చేస్తుంది కాబట్టి సన్‌స్క్రీన్ వాడాలి.

చలి నుండి రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు ధరించాలి.

పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక: మీ చర్మం రకానికి తగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి, ఏదైనా చర్మ సమస్య ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించండి.

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

Follow Us on :-