తేనె సేవించేవారు తెలుసుకోవలసిన విషయాలున్నాయి. వాస్తవానికి తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే ఇదే తేనెను విరుద్ధ పదార్థాలతో కలిపి తింటే అనారోగ్యం చుట్టుకుంటుంది. తేనెతో ఏయే పదార్థాలు తీసుకోకూడదో తెలుసుకుందాము.
webdunia
తేనె, నెయ్యి సమభాగాలుగా కలిపి ఎట్టి పరిస్థితుల్లో భుజించరాదు.
తేనెను వాన నీటితో సమంగా కలిపి వాడితే అది అనారోగ్యాన్ని తెస్తుంది.
తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషతుల్యమవుతుంది.
నిమ్మపండు రసాన్ని తేనె, నెయ్యిలతో కలిపిగానీ, మినపప్పు-బెల్లము-నెయ్యితో కానీ తీసుకోరాదు.
మాంసము తేనెగానీ, నువ్వులుగాని బెల్లముగాని, పాలుగాని, మినుములు కానీ ముల్లంగి కానీ మొలకెత్తిన ధాన్యాలు కానీ కలిపి వాడరాదు.
వెల్లుల్లి, మునగ, తులసి మొదలైన పదార్థాలను తిని వెంటనే పాలు తాగరాదు.
చేపలు తిన్న వెంటనే పాలు తాగకూడదు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం అందించడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.