చెడు కొవ్వును కరిగించే చిట్కా, పురుషులకు శక్తినిచ్చే టిప్
ప్రస్తుతం చాలామంది బాగా ఇబ్బందిపడుతున్న సమస్యల్లో అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ ప్రధానమైనవి. ఇలాంటి సమస్యలను చిన్నచిన్న చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram and webdunia
ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి తొడలు, ఉదరం తదితర భాగాల్లో మర్దిస్తే అక్కడ పేరుకున్న కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
రొమ్ములపై గడ్డలున్న చోట ఈ మిశ్రమంతో మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి.
పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తే నీళ్ల విరేచనాలు, అతిసారం తగ్గుతాయి.
పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమంగా కలిపి వాటికి తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర వేసుకుంటే పురుషుల్లో సామర్థ్యం పెరిగుతుంది.
ఈ మాత్రలు సేవిస్తుంటే పురుషులకి నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం అందించడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.