క్షయ వ్యాధి లక్షణాలు ఏమిటి?

క్షయవ్యాధి (TB) అనేది ఒక అంటు వ్యాధి, ఇది తరచుగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఉమ్మివేసినప్పుడు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. క్షయవ్యాధిని నివారించవచ్చు, నయం చేయవచ్చు. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మంది TB బాక్టీరియా బారిన పడ్డారని అంచనా. ఈ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం, నెలలు తరబడి దగ్గు ఉన్నట్లైతే అది క్షయవ్యాధి లక్షణంగా సందేహించవచ్చు.

ఆకలి లేకపోవడం, గుండె నొప్పి, జలుబు, సాయంత్రం వేళల్లో జ్వరం వంటి సూచనలు కనిపిస్తాయి.

క్షయ వ్యాధి సోకినట్లైతే గొంతు కండలు ఏర్పడడం, కొద్ది నెలల తేడాలో అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం వుంటుంది.

క్షయవ్యాధి ఊపిరితిత్తులకే కాక అప్పడప్పుడు ఎముకలు, కీళ్లు, చర్మం వంటి వాటికి కూడా రావచ్చు.

క్షయ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంధి, జుట్టు తప్ప మిగిలిన అవయవాలన్నింటికి ఈ వ్యాధి రావచ్చు.

క్షయ వ్యాధిని నిర్ధారించడానికి రక్త పరీక్షలు, చర్మపరీక్ష, కళ్లెలో పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

వైద్యుల సూచనల మేరకు ఔషధాలును సకాలంలో అందిస్తూ వస్తే క్షయ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

పుచ్చకాయ రసంలో వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటి?

Follow Us on :-