వయసు పెరిగే కొద్దీ చర్మం లక్షణాలు మారిపోతూనే ఉంటాయి. అందువల్ల చర్మ నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ. సరైన పద్ధతులు అనుసరించడం ద్వారా దీనిని మెరుగ్గా చేయవచ్చు. ఒకరి రోజు వారీ కార్యక్రమాలలో అనుసరించాల్సిన చర్మ నిర్వహణ రహస్యాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
గాఢత కలిగిన సబ్బులు వాడకూడదు. ఈ తరహా సబ్బులు సాధారణంగా చర్మంకు అవసరమైన నూనెలను కూడా తొలగిస్తాయి.
చర్మంపై మాయిశ్చర్ స్థాయిని నిలిపి ఉంచడానికి స్నానం చేసిన తరువాత టవల్‌ను చర్మంకు తట్టితే సరిపోతుంది
తగినంతగా ఆకుకూరలు, లీన్ ప్రొటీన్, తక్కువ కొవ్వు కలిగి, అధికంగా శరీరానికి అవసరమైన నూనెలు అందించే ఆహారం తీసుకోవాలి.
శరీరానికి తగినంతగా నీరు కావాలి. కనీసం రోజుకు ఆరు గ్లాస్‌ల నీళ్లు తాగాలి.
చర్మంపై మృతకణాలను తొలగించే పద్ధతి ఎక్స్‌ఫోలియేషన్. దీనిద్వారా నూతన కణాలు త్వరగా పునరుద్ధరించబడతాయి.
తగినంత నిద్రతో ప్రయోజనాలెన్నో. చర్మంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ రాకుండా చేయడంలో ఇది తోడ్పడుతుంది
చర్మం పాడవడానికి సూర్యకిరణాలు కూడా కారణమవుతాయి. అందువల్ల సన్‌స్ర్కీన్ రాయడం మంచిది.