బెల్లంలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

బెల్లం. దీనిని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేకాదు బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ఇంకా ఈ బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

ప్రతిరోజూ గ్లాసు పాలలో బెల్లాన్ని కలిపి సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి ఉదరంలో గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది.

బెల్లంలో వుండే ధాతువు ఇనుము ఎనీమియా రోగులకు మేలు చేస్తుంది.

బెల్లం హల్వా తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను వదిలించి చర్మానికి మంచి మెరుపునిస్తుంది, మొటిమలని నివారిస్తుంది.

బెల్లం కలుపుకుని టీ తాగితే జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం కలుగుతుంది.

బెల్లంలో యాంటీ అలెర్జీక్ తత్వం వుంటుంది కనుక దీనిని ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

బెల్లాన్ని నెయ్యితో కలిపి సేవిస్తే చెవి నొప్పి తగ్గిపోతుంది.

కిడ్నీలో రాళ్లను కలిగించే 7 ఆహారాలు ఏమిటి?

Follow Us on :-