ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి.

credit: social media and webdunia

ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది.

ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి.

కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి.

అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి.

మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.

కనీసం ఏడుగంటలకు తగ్గకుండా నిద్రపోవాలి, అలాగని 8 గంటలకు మించి నిద్ర వద్దు.

పరిశుభ్రమైన మంచినీరు తాగుతుండాలి, అలాగే శరీరానికి శక్తినిచ్చేందుకు పాలు కూడా తాగాలి.

తాజా పళ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాత తినాలి.

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు, ఏంటవి?

Follow Us on :-