టొమాటోలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

టొమాటో రకాన్ని బట్టి తీపి- ఆమ్లత్వం మారవచ్చు, కానీ అన్ని రకాల టమోటాలు పొటాషియం, విటమిన్ సితో సహా అవసరమైన పోషకాలను అందిస్తాయి. టొమటోలో వున్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

టొమాటోలు తక్కువ క్యాలరీలు, పోషకాలను కలిగి ఉంటాయి, వాటిని సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేస్తాయి.

పచ్చి టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

టొమాటోలను ఉడికించడం వల్ల లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా విడుదలై క్యాన్సర్ నుండి కాపాడుతుంది.

టమోటాలు గుండె, మెదడు, ప్రోస్టేట్ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

టొమాటోలు కండరాల నొప్పిని తగ్గించడానికి, వ్యాయామం తర్వాత అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.

చిత్తవైకల్యం నుండి రక్షించడంలో టొమాటోలు సహాయపడతాయి.

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో టమోటాలు సహాయపడతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

బాదం పప్పులు తినేవారు ఇవి తెలుసుకోవాలి

Follow Us on :-