మట్టి పాత్ర. మట్టి పాత్రల్లో వంటకాలు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని ఆయుర్వేదం గట్టిగా సిఫార్సు చేస్తుంది. ఈ మట్టి పాత్రల్లో వంటలు చేసుకోవడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
మట్టి కుండలలో వంట చేయడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు వంట అంతటా ఆవిరిని ప్రసరించే సామర్థ్యం ఆ పాత్రకు వుంటుంది.
మట్టి పాత్రలో వుడికించడం వల్ల తేమను పుష్కలంగా అందించడమే కాకుండా తక్కువ నూనెతో ఉడికించగలము.
మట్టి పాత్రలో వండటం వల్ల అన్ని విటమిన్లు పూర్తిగా లభ్యమవుతాయి. ఇతర పాత్రల్లో ఇది సాధ్యం కాదు.
మట్టి పాత్రలో పదార్థాలు నెమ్మదిగా వుడుకుతాయి కనుక వండే ఆహారంలోని అన్ని పోషకాలను నిలుపుకుంటుంది, అందువల్ల ఆహారం చాలా రుచిగా ఉంటుంది.
ఇతర పాత్రల్లో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే పోషక విలువలు కోల్పోతాయి, కానీ మట్టి పాత్రలో అలా జరగదు.
మట్టి కుండలో వండిన ఆహారంలో కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
మట్టిపాత్రలో ఉప్పు, కారం, పులుపు చేర్చితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.