బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

అధిక రక్తపోటు. ఆరోగ్యకరమైన జీవనశైలి, మార్పులు రక్తపోటుకు కారణమయ్యే కారకాలను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

శారీరక శ్రమను పెంచడం, బరువు తగ్గడం, వ్యాయామం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

హృదయనాళ వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి వారం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమను చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.

ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకోవాలి. సోడియం స్థాయిలు తక్కువగా వుండేట్లు చూసుకోవాలి.

ధ్యానం, దీర్ఘ శ్వాస, మసాజ్ ద్వారా కండరాల సడలింపుతో బీపీ కంట్రోల్ అవుతుంది.

యోగా, ప్రశాంతమైన నిద్ర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.

ధూమపానం, మద్యపానం తదితరాలకు దూరంగా వుండాలి. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

పొగాకు పొగలోని రసాయనాలు శరీర కణజాలాలను దెబ్బతీస్తాయి. రక్తనాళాల గోడలను గట్టిపరుస్తాయి.

గమనిక: వీటితో పాటు వైద్యుని సలహాలు కూడా ఆచరిస్తుండాలి.

పోషకాల గని దానిమ్మ, ఇవి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Follow Us on :-