రోజూ తమలపాకు తినవచ్చా?

తమలపాకులు. వీటిని తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రిపూట తమలపాకులను బాగా కడిగి ఆ తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. తమలపాకు ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

తమలపాకులను రోజూ వేసుకోవచ్చు, ఇలా చేస్తుంటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది.

తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే గొంతు సమస్య తగ్గుతుంది

తమలపాకుల్లో వున్న పోషకాలు ప్రాణాంతమైన కేన్సర్ రాకుండా నిరోధించగలదు.

తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి.

తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు తగ్గాలంటే 2 కప్పుల నీళ్ళలో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఆ కషాయం తాగాలి.

ఐరన్‌, క్యాల్షియం ఉండటం వల్ల పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

మధుమేహం, మెంతి గింజల నీరు తాగితే ఏమవుతుంది?

Follow Us on :-