తమలపాకు ప్రయోజనాలు

తమలపాకులు తీసుకుంటే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రిపూట తమలపాకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇంకా తమలపాకు ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: twitter and Instagram

తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు రసంతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది.

గొంతు సమస్యలకు, తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

తమలపాకుల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం, థయామిన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, సి వంటివి ఉన్నాయి.

తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి.

తలనొప్పి, చిగుళ్లనొప్పి, కీళ్ళనొప్పులకు తమలపాకు వాడితే ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు, వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది.

జలుబు, దగ్గుతో బాధపడుతుంటే రెండు కప్పుల నీళ్ళలో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఒక కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి.

ఐరన్‌, క్యాల్షియం ఉండడం వల్ల పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు నిపుణులను సంప్రదించాలి.

శీతాకాలంలో నువ్వులు బెల్లం ఉండలు తింటే ఏమౌతుంది?

Follow Us on :-