బాలీవుడ్ నటి కృతి సనన్, ప్రభాస్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. బాహుబలి స్టార్ ప్రభాస్‌తో కృతి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
credit: social media
కాఫీ విత్ కరణ్ చాట్ షో తర్వాత ప్రభాస్, కృతి డేటింగ్ వార్తలు మొదలయ్యాయి.
షో చేస్తున్న టైంలో కాలింగ్ సెగ్మెంట్ సమయంలో కృతి ప్రభాస్‌కు ఫోన్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం కనిపించింది.
ప్రభాస్, కృతి ఒకరినొకరు బలమైన భావాలను షేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య బంధం బలపడిందని చెబుతున్నారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా వీరి బంధం కొనసాగుతోంది.
బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ ప్రకారం, షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా వారిద్దరూ ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఒకరికొకరు టచ్‌లో ఉంటున్నారట.
ప్రభాస్ కంటే ముందు, కృతి పేరు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కార్తీక్ ఆర్యన్‌లతో కూడా రిలేషన్లో వున్నట్లు భోగట్టా.
ఆదిపురుష్‌లో కృతి సీత పాత్రలో, ప్రభాస్ రామ్‌గా కనిపించనున్నారు.