విఘ్నేశ్వరుడిని లక్ష్మీ తులసీతో పూజిస్తే..!
సంవత్సరారంభంలో వచ్చే తొలి పండుగ వినాయకచవితి. గణేశుడు సకల గణతంత్రానికి అధిపతి. విఘ్నేశ్వరుడిని "అనాథనాథ సర్వజ్ఞ" అని పిలుస్తారు. జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురై ఆరోగ్యపరంగా, జీవనపరంగాను మనం అనాథలమైనప్పుడు అన్నీ తెలిసిన వినాయకుని స్మరిస్తే వాటిని ఎదుర్కొనే శక్తి, ఆత్మబలం ఇస్తాడు.వ్రతంలో ఆయనకు పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పంచదార కలిపి పంచామృతం సమర్పిస్తాం. పాలలో ధాతుశక్తి, పెరుగులో దీపనశక్తి వృష్యం అంటే నరాల పటుత్వం, నెయ్యిలో మేధోబలం అంటే బుద్ధిశక్తిని పెంచే గుణం, తేనెలో వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం-హృద్యం అంటే గుండెను బలపరచేది ఉంటుందంటారు. అలాగే వినాయక పూజకు తులసీవ్రతం, ఎరుపుపూలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసీతో పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.