Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింటర్ స్పెషల్ : ధాల్ సూప్ టేస్ట్ చేయండి.

Advertiesment
Winter special: toor Dhall soup
, శుక్రవారం, 28 నవంబరు 2014 (17:30 IST)
వింటర్లో సాయంత్రం పూట మార్నింగ్ పూట ఒక కప్పు సూప్ ట్రై చేయండి. ఆకుకూరలు, కూరగాయలు, మటన్, చికెన్, సీ ఫుడ్స్‌తో పాటు చిరు ధాన్యాలతో కూడా సూప్ ట్రై చేయండి. చిరు ధాన్యాలతో తయారయ్యే సూప్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఫైబర్ లభిస్తుందని, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కావల్సిన పదార్థాలు:
కందిపప్పు : ఒక కప్పు 
ఉల్లిపాయ తరుగు: అర కప్పు 
అల్లం తురుము: ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి తరుగు: ఒక టీ స్పూన్ 
వెన్న లేదా నెయ్యి: ఒక టీ స్పూన్ 
పసుపు: చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్: ఒక టీ స్పూన్ 
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
నిమ్మరసం: కొద్దిగా
జీలకర్ర: ఒక టీ స్పూన్ 
పచ్చిమిర్చితరుగు: ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసి పది నిమిషాల పాటు నానబెట్టిన కందిపప్పుతో పసుపు, సన్నగా తరిగిన అల్లం వేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించి దింపేయాలి. బాగా చల్లారిన తర్వాత గరిటెతో మెదిపి తగినన్ని నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి. 
 
పాన్‌లో వెన్న లేదా నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత మెదిపి ఉంచుకున్న పప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కలిపి మరో ఐదు నిముషాలు మరిగించి దింపి, వడకట్టాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu