Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టెంట్ ఎనర్జీ కోసం.. సగ్గుబియ్యం సలాడ్!

Advertiesment
Instant energy receipe sabudana salad
, శనివారం, 20 డిశెంబరు 2014 (15:31 IST)
తక్కువ కేలరీలలో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం సగ్గుబియ్యం. ఇందులో కార్బొహైడ్రేడ్లు అధికం. అందుకే శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకుల్లోనూ, బ్రెడ్ ఐటమ్స్‌లోను వీటిని ఎక్కువగా వాడుతుంటారు. మీరెప్పుడైనా ఆఫీసు నుంచి ఇంటికొస్తునే ఆకలి వేస్తుందనుకోండి. 
 
సమయం కాని సమయంలో అయితే భోంచేయడానికి వీలవ్వదు. కాబట్టి.. తిన్న వెంటనే సులువుగా జీర్ణమై, తక్షణమే శక్తినిచ్చేందుకు సగ్గుబియ్యం వంటలు బాగా పనికొస్తాయి. అటువంటి వాటిలో సబుదాన సలాడ్ ఒకటి. దీన్ని చేసుకోవడం చాలా సులభం. 
 
అరకప్పు సగ్గుబియ్యం, అరకప్పు పుదీనా, రెండు పచ్చిమిర్చి, ఒక కప్పు మజ్జిగ, అందుబాటులో ఉన్న పండ్లు..  రెండు టేబుల్ స్పూన్న ఎండుద్రాక్ష, చిటికెడు బ్లాక్ సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పుదీనాలను మజ్జిగలో కలపాలి. ఆ తర్వాత సగ్గుబియ్యాన్ని అందులో కాసేపు నానబెట్టి, వడబోయాలి. 
 
అందులో తేలిన సగ్గుబియ్యాన్ని సన్నని సెగమీద కాస్త ఉడికించి మళ్లీ మజ్జిగలో కలిపి.. ఎండుద్రాక్ష, పండ్ల ముక్కలను జతచేసి తింటే బావుంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu