"బీరకాయ పొట్టు పచ్చడి"లో సమృద్ధిగా విటమిన్ 'ఏ'
కావలసిన పదార్థాలు :బీరకాయ పొట్టు.. రెండు కప్పులుమెంతులు.. కాసిన్నికరివేపాకు.. పావు కప్పుకొత్తిమీర.. పావు కప్పువెల్లుల్లి.. పది రెబ్బలుఉప్పు.. తగినంతచింతపండు.. నిమ్మకాయంతఎండుమిరపకాయలు.. ఐదుజీలకర్ర.. అర టీ.ధనియాలు.. ఒక టీ.నెయ్యి.. సరిపడాతయారీ విధానం :ముందుగా బీరకాయ పొట్టును బాగా పిండి కాస్త పొడిగా ఉండేలా చూడాలి. స్టవ్‌పై బాణలి పెట్టి అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి ఈ బీరకాయ పొట్టును వేయించి వేరే పాత్రలోకి తీసుకోవాలి. అదే బాణలిలోనే మరికాస్త నెయ్యి వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీరలను వేసి బాగా వేయించాలి.తరువాత వీటన్నింటినీ తగినంత ఉప్పువేసి రోట్లో మెత్తగా నూరాలి. ఆపై వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసి నున్నగా నూరాలి. అంతే బీరకాయ పొట్టు పచ్చడి సిద్ధమైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, దోశెలు, ఇడ్లీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బీరకాయ పై పొట్టులో విటమిన్ "ఎ" చాలా పుష్కళంగా లభిస్తుంది.