Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తు... ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎక్కడ పెంచాలి? (Video)

వాస్తు... ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎక్కడ పెంచాలి? (Video)
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (21:57 IST)
పూలకోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో వుంచవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచరాదు.
 
పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి మామిడి, పోక, అవిశ మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకి సంబంధం లేకుండా వుండాలి. దాన్లోకి వెళ్లే గేటు కూడా ప్రత్యేకంగా వుండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించేవారికి మేలు జరుగుతుంది.
 
కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు. నైరుతి దిశలో రేగుచెట్టు, దానిమ్మ, సీతాఫలం వుండకూడదు. వాయవ్యంలో ఉసిరి, దేవదారు, మోదుగ, అశోక చెట్లు వుండకూడదు. ఈశాన్యంలో అశోక, జమ్మి, పొగడ, సంపంగి, మల్లె, పిప్పలి వుండకూడదు. పడమర పనస, దక్షిణాన పోకచెట్టు, కొబ్బరి చెట్టు పెంచరాదు. మోదుగ, సంపెంగ, మద్ది, గానుగ తదితర మొక్కలను ఇంటి ప్రహరీగోడ లోపల పెంచకూడదు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం, ఎందుకంటే?