Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటి స్థలంలో ఏ దిశ ఎత్తుగా ఉండాలో తెలుసా?

Advertiesment
భవిష్యవాణి
ఇంటి నిర్మాణంలో ఎత్తుపల్లాలను బట్టి మంచి, చెడు ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా ఇంటి స్థలంలో అన్నిటికంటే నైరుతి దిక్కు ఎత్తుగా ఉండాలి. దీనివలన ఆ ఇంటి యజమానులు కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారని వాస్తు చెబుతోంది. అయితే నైరుతి దిశ పల్లంగా ఉంటే మాత్రం అనారోగ్యం, దుర్వ్యసనాలు చోటుచేసుకుంటాయి.

అదేవిధంగా దక్షిణ భాగం నైరుతి భాగం కంటే పల్లంగానూ, తతిమా వాటికంటే ఎత్తుగానూ ఉండాలి. దీనివలన ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అయితే పల్లంగా ఉంటే మాత్రం దరిద్రులగుట, అనారోగ్యాలు తప్పవు.

ఇకపోతే.. ఆగ్నేయం-నైరుతి దక్షిణ దిశకంటే పల్లంగా ఉండాలి. ఎత్తుగా ఉంటే మాత్రం అగ్ని ప్రమాదాలు, శత్రుభయం, చోరబాధలు చెడు ప్రవర్తన వంటివి కలుగుతాయి.

అలాగే.. తూర్పు దిక్కు.. పడమర కంటే పల్లంగా ఉంటే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. కానీ ఈ దిశ ఎత్తుగా ఉంటే కార్యసాధన కష్టతరం, అధికశ్రమ కలుగుతుంది.

ఇకపోతే.. ఇంటి నిర్మాణంలో ఈశాన్య దిశ అన్నిటికన్నా పల్లంగా ఉంటే సర్వశుభములు కలుగుతాయి. ఎత్తుగా ఉంటే అశుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఉత్తరం పల్లంగా ఉంటే సకలశుభములు కలుగుతాయి.ఎత్తుగా ఉంటే చెడు ఫలితాలు కలుగుతాయి.

చివరిగా వాయువ్యం-నైఋతి దిశ.. ఆగ్నేయ మూల కంటే ఎత్తు ఉండకూడదు. ఎత్తుగా ఉంటే అపజయం, ఆకస్మిక ధననష్టం. ఈశాన్యం కన్నా ఎత్తుగా ఉంటే ధనాదాయవృద్ధి, కార్యజయం పొందగలరు. పడమర-తూర్పు కంటే ఎత్తుగా ఉండాలి. పల్లంగా ఉంటే ధననష్టం, సంతానం వలన అవమానాలు భరించాల్సిఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu