Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటి వాస్తు బాగుంటే మంచి సంతానం కలుగుతుందా?

Advertiesment
వాస్తు
File
FILE
ఇంటి వాస్తు బాగుంటే మంచి సంతానం కలుగుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటుంది. నిజానికి వాస్తు బాగుంటే ఒక్క మన ఇల్లే కాదు.. ఈ సమాజం కూడా బాగుపడుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తుకు వసుధైక కుటుంబానికి సంబంధం ఉందని వారు అంటున్నారు.

మన అలవాట్లను, ఆలోచనా విధానాలను అనుక్షణం ప్రభావం చేసేవి మన చుట్టూ ఉండే పంచభూతాలేనని వారు అంటున్నారు. ఎక్కడైతే వికృత ప్రకృతి ఉంటుందో ఆ గృహ సముదాయంలోంచి సామాజిక సంఘర్షణలు, సమస్యలు పుట్టుకొస్తాయని చెపుతున్నారు.

పరిసరాల మార్పు మనలో ఆనందపు మార్పులను ఆవిష్కరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. సృష్టి క్రమంలో మార్పు అనివార్యమని, అందువల్ల వాస్తు మంచి గృహం మంచి సమాజానికి నాంది పలుకుతుంది. ఆ విధంగా ఉత్తమ సంతానానికి ఉత్తమ గృహం (పక్కా వాస్తుతో కూడిన ఇల్లు) ఎంతో శ్రేష్టమని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu