Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకయ్య నాయుడు వంటివారిని ఏమనాలి? ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఫైర్

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా మాటలతో దాడి చేశారు. వెంకయ్య నాయుడువంటివారని ఏమనాలి అంటూ నిలదీశారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లా

Advertiesment
వెంకయ్య నాయుడు వంటివారిని ఏమనాలి? ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఫైర్
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (14:49 IST)
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా మాటలతో దాడి చేశారు. వెంకయ్య నాయుడువంటివారని ఏమనాలి అంటూ నిలదీశారు. ఆమె బుధవారం హైదరాబాద్‌లోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
 
'ఎంత బాధాకరమైన విషయమంటే వెంకయ్య నాయుడు తెలుగు గడ్డ మీద పుట్టిన నెల్లూరు వాసి. ఆనాడు ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చాక తన బీజేపీ, తన మిత్రపక్షం టీడీపీ ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్య పెడుతుంటే ఎందుకు మాట్లాడలేదు? తెలుగు బిడ్డ అయిన వెంకయ్య నాయుడు మోదీని ఎందుకు ప్రశ్నించలేదు? అని ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, 'వెంకయ్య నాయుడుకి నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్‌కి వెళ్లడానికి సమయం ఉంటుంది. ప్రజలకు అవసరం లేని, అసత్యాలతో నిండిని ఆనందనగరి కార్యక్రమానికి రావడానికి సమయం ఉంటుంది. కానీ, ఆనాడు రాజ్యసభలో హోదా గురించి ప్రశ్నించిన విషయాన్ని గురించి మాట్లాడడానికి సమయం ఉండదు. ఇలాంటి వారిని ఏమనాలి?' అని రోజా విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతిపై రేప్ .. నా భర్తకు నార్కో పరీక్షలు నిర్వహించాలి : బీజేపీ ఎమ్మెల్యే భార్య