Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరకు ఎమ్మెల్యే కిడారిని ఎందుకు చంపారంటే...

విశాఖపట్టణం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. నిజానికి కిడారి గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైకా

అరకు ఎమ్మెల్యే కిడారిని ఎందుకు చంపారంటే...
, ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:20 IST)
విశాఖపట్టణం జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. నిజానికి కిడారి గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైకాపాను వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.
 
2014లో అరకు నుంచి పోటీ చేసిన కిడారి... శివేరి సోముపై విజయం సాధించారు. శివేరి సోము 2009లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. మావోయిస్టుల కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు తోపాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా ప్రాణాలు కోల్పోయారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో కిడారి, శివేరి సోముకు మంచి పేరు ఉంది. 
 
కిడారి ఆదివారం ఉదయం అరకులోనే ఉండి... మాజీ ఎమ్మెల్యే శివేరి సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామ పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కిడారి అక్కడికక్కడే చనిపోయారు. 
 
దీనికి కారణం పచ్చని అడవుల్లో పర్యావరణాన్ని దెబ్బతీసేలా మైనింగ్ తవ్వకాలను కిడారి చేపట్టారు. వీటిపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరిస్తూ వచ్చారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న క్వారీని తక్షణం మూసివేయాలని మావోలు డిమాండ్ చేశారు. కానీ, ఇవేమీ పట్టించుకోని కిడారి.. యధేచ్చగా మైనింగ్ తవ్వకాలు జరిపిస్తూ వచ్చారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై కాల్పులు జరిపారి హత్య చేశారు. 
 
నిజానికి విశాఖ మన్యంలో గత కొంతకాలంగా మావోయిస్టులు అలజడి లేదు. చాలాకాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు. గ్రేహౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఇపుడు కాల్పులకు తెగబడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...