సోషల్ మీడియాలో రీల్స్ వీడియోల కోసం జనం పిచ్చి పిచ్చి పనులతో పాటు సాహసాలు చేస్తున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం ఆడాడు ఓ వ్యక్తి. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగర శివారుల్లోని ఎన్ హెచ్931లో డిస్ ప్లేయింగ్ బోర్డుపై ఎక్కిన ఓ యువకుడు బోర్డుకు వేలాడుతూ ఘోరమైన స్టంట్ చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పిచ్చి పనులు మరొకరు చేయరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.