Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

ప్రత్యేక హోదా సెగలు : ఏపీ బంద్.. వైకాపా నేతల అరెస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఉదయాన్నే రోడ్డుపైకి వచ్చి

Advertiesment
Special status
, మంగళవారం, 24 జులై 2018 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఉదయాన్నే రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు బసులను అడ్డుకుని ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించారు.
 
ముఖ్యంగా, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో వైసీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు.. ఆంధ్ర ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒంగోల్ నగరంలోనూ వైసీపీ నేతలు ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ ప్రశాంతగా సాగుతోంది. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నాయకులను అరెస్ట్‌ చేయిస్తోంది. పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచింది. 
 
బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను స్టేషన్లు మారుస్తా తిప్పుతున్నారు. మొదట సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల తీసుకెళ్లారు. తర్వాత రాజుపాలెం పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నరసరావు పేట నుంచి నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వెంకటగిరి, తిరుపతి రహదారిని కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ్ముడికి పెళ్లి అయితే... బయటకు వెళ్లాల్సి వస్తుందనీ అలా చేశాడు...