ఒకపుడు బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఐటీ ఉద్యోగం ఖాయమని భావించేవారు. వీలైతే స్వదేశం లేదా విదేశాల్లోలోని పేరుమోసిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని నమ్మేవారు. కానీ, ఇపుడు పరిస్థితి ఇపుడు తారుమారైంది. ఈ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఇపుడు నిరుద్యోగులుగా ఉన్నారు. పైగా, స్వీపర్ పోస్టులకు సైతం దరఖాస్తు చేసుకుంటున్నారు.
తాజాగా తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ఖాళీగా 14 శానిటరీ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల కోసం పదో తరగతి ఫెయిల్ అయిన నిరుద్యోగులతో పాటు.. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు.
అంతేనా, ఎంబీఏ, పీజీ, డిప్లొమోలు పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 14 పోస్టుల కోసం ఇప్పటికే 3900కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. పైగా, స్వీపర్ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.17 వేలు వేతనం ఇవ్వనున్నారు.