Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#WhereisKCR ట్రోలింగ్.. కేసీఆర్ ఇన్ ప్రగతి భవన్.. (video)

Advertiesment
KCR
, శనివారం, 11 జులై 2020 (17:41 IST)
#WhereisKCR పేరుతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ విపక్షాలు నానా హంగామా చేశాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతుంటే.. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించాల్సిన అవసరం ఏముందంటూ ఏకంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. 
 
ఇక మంత్రి కేటీఆర్ కూడా మీడియా, నెటిజన్లు కరోనా నుంచి కోలుకున్న వారి వివరాలు చెప్పకుండా, ఓ వీడియోను పట్టుకుని రచ్చ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు బీభత్సంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూడా లేకుండా ఫాం హస్‌కు వెళ్లిపోవడం, ప్రజలకు కూడా కనిపించకపోవడం మీద సామాన్యుల నుంచి విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ సుమారు రెండు వారాలుగా ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో ఉన్నారు. ఆయన త్వరలో రైతులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ నియంత్రణ సాధ్యమే డబ్ల్యూహెచ్ఓ