Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జస్ట్ రెండు నెలలు ఆగండి, సంచలన వార్త వింటారు: బాంబు లాంటి వార్త పేల్చిన కేసీఆర్

KCR meets Devegowda
, గురువారం, 26 మే 2022 (20:34 IST)
కేసీఆర్. సంచలనాలకు మారుపేరు. ప్రస్తుతం కేంద్రంతో ఢీకొడుతూ దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక కూటమి పార్టీలతో సమావేశమవుతున్నారు. గురువారం బెంగళూరులో మాజీప్రధాని దేవెగౌడను కలిశారు.


ఈ సందర్భంగా ఆయన... రెండు నెలలు ఆగండి, సంచలన వార్త వింటారు, రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోతోందంటూ బాంబు లాంటి వార్త చెప్పారు. ఇంతకీ ఆ మార్పు ఏమిటి... రెండు నెలల్లో అంతటి సంచలనమైనది ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

 
దేవెగౌడతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎందరో ప్రధానులు పరిపాలించారు. దేశ పరిస్థితి మాత్రం బాగుపడలేదు. మనకంటే ఎంతో వెనకబడి వున్న చైనా అభివృద్ధిలోనూ, ఆర్థికంగా దూసుకుపోతోంది. మనం మాత్రం ఎంతో వెనకబడి వున్నాం.

 
ఈ పరిస్థితి మారాలంటే మార్పు రావాల్సిందే. ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. భారతదేశం ఉజ్వల భవిష్యత్ కోసం కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. మరోవైపు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కేసీఆర్ పైన విరుచుకపడ్డారు.


తెలంగాణ వచ్చాక ప్రయోజనం పొందింది ఒక్క కుటుంబమేననీ, ప్రజలకు ఏమీ రాలేదన్నారు. కేవలం ఆ కుటుంబం మాత్రమే దోచుకుంటోందని దుయ్యబట్టారు. కుటుంబ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదిరిపోయే ఫీచర్లతో కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతంటే?