Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ వంటి సీఎంను నేనెక్కడా చూడలేదు: బాబా రాందేవ్

రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనలు అద్భుతమని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ముఖ్యంగా, కేసీఆర్

Advertiesment
కేసీఆర్ వంటి సీఎంను నేనెక్కడా చూడలేదు: బాబా రాందేవ్
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:21 IST)
రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనలు అద్భుతమని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ముఖ్యంగా, కేసీఆర్ ముందుచూపు ఉన్న నేత అని యోగా గురువు కొనియాడారు. 
 
బాబా రాందేవ్ గురువారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతిభవన్‌‌కు వచ్చిన బాబా రాందేవ్‌‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. కారు వద్దకు వచ్చి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా తోడ్కొని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. మెమెంటోను అందించారు. ఆ తర్వాత వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు.
 
అనంతరం సీఎంతో ప్రజాసమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించిన బాబా రాందేవ్ అనంతరం ట్విట్టర్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న నేత అని, రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్పష్టత ఉందని ట్వీట్ చేశారు. రైతులపై, గ్రామీణ, ఆర్థిక, న్యాయవ్యవస్థలకు సంబంధించిన అంశాలపై ఆయన ఆలోచనల్లో స్పష్టత, దూరదృష్టి కనిపించిందని రాందేవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
'తెలంగాణ రైతులకు ఏది కావాలో కేసీఆర్‌ అది చేస్తున్నారు. ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసే సీఎం ఆలోచన అద్భుతం' అని రాందేవ్‌ కొనియాడారు. ఉత్పాదక రంగమైన వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని, రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు... యలమంచిలి