Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ గొలుసుకట్టుకు ఆ ఐదు రైళ్లే కారణమా?

Advertiesment
COVID-19
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:39 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికంతటికీ కారణంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమమేనని తెలిసింది. ఇక్కడ నుంచే దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించినట్టు కేంద్రం ఓ స్పష్టతకు వచ్చారు. 
 
ఈ మతపరమైన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఇస్లాం మతపెద్దలు వచ్చారు. ముఖ్యంగా, కరోనా బాధిత దేశాల నుంచి అనేక విదేశీ ప్రతినిధులు కూడా వచ్చారు. వారి నుంచే స్వదేశీ ప్రతినిధులకు సోకింది. వారు తమతమ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ స్థానికులకు ఈ వైరస్‌ను అంటించారు. అలా ఇపుడు దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువైపోయింది.
 
అదేసమయంలో ఈ వైరస్ ఇంతలా వ్యాపించడానికి ఈ సదస్సులో పాల్గొన్న వారంతా తిరుగు ప్రయాణ సమయంలో ఐదు రైళ్ళలో ప్రయాణించారు. అదీకూడా మార్చి 13 నుంచి 19 లోపు ఐదు రైళ్లలో వీరు ప్రయాణించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ ఐదు రైళ్లు దేశంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రయాణించాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేసిన వారు వివిధ ప్రాంతాల్లో దిగిపోయారు. వారి ద్వారా అనేక ప్రాంతాలకు వైరస్ సోకింది. 
 
ఆ ఐదు రైళ్ల వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ నుంచి గుంటూరు మీదుగా నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ - చెన్నైల మధ్య నడిచే గ్రాండ్ ట్రంక్ (జీటీ ఎక్స్‌ప్రెస్), ఢిల్లీ - తమిళనాడు మధ్య నడిచే తమిళనాడు ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ - రాంచీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. 
 
మత ప్రార్థనలకు వెళ్లిన వారంతా ఢిల్లీ నుంచి ఈ ఐదు రైళ్ళలోనే అధికంగా ప్రయాణించారు. దాదాపు ప్రతీ ట్రైన్‌లో 1000 నుంచి 1200 మంది ప్రయాణం చేసే అవకాశముంది. వారిలో ఎంతమందిపై కరోనా ప్రభావం చూపిందో తెలుసుకోవడమే తక్షణ కర్తవ్యంగా అధికారులు భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, రైల్వే అథారిటీని సంప్రదించి ప్రయాణికుల జాబితాను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో 10 మంది ఇండోనేషియన్లు ప్రయాణించారని, వారంతా కరీంనగర్‌కు మత ప్రార్థనలకు వెళ్లారని అధికారులు ఇప్పటికే తేల్చారు. వారు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా... రోగులకు సేవ చేస్తుంటే సోకింది...