Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ బంద్ : దేశవ్యాప్తంగా ఎఫెక్టు - కేరళలో తీవ్రం.. నిలిచిన బ్యాంకు సేవలు

Advertiesment
భారత్ బంద్ : దేశవ్యాప్తంగా ఎఫెక్టు - కేరళలో తీవ్రం.. నిలిచిన బ్యాంకు సేవలు
, మంగళవారం, 8 జనవరి 2019 (12:19 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు దిగాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణాతో పాటు బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, ఇప్పటికే శబరిమల వివాదంతో అట్టుడికిపోతున్న కేరళ రాష్ట్రంలో ఈ బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. 
 
ఈ బంద్‌లో ఐఎన్‌టీయూసీ ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూతో పాటు 10కి పైగా కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వామపక్ష ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాల్లో బంద్ ఉధృతంగా సాగుతోంది. 
 
సర్కారీ కొలువుల్లో కనిష్ట వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలని, పబ్లిక్ రంగ షేర్లను విక్రయించడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారత్ బంద్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో ప్రజాసేవలన్నీ స్తంభించిపోయాయి. ఆందోళనకారులు రోడ్లను బ్లాక్ చేసి, బస్సు సర్వీసులను అడ్డుకుంటున్నారు. అలాగే, రైళ్ళు కూడా నడవకుండా రైల్ రోకోలకు దిగారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌కు చెందిన 20 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆశీస్సులతో ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డు సృష్టిస్తుంది... బాలయ్య(Video)