Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకన్న సాక్షిగా దీక్ష .. టీడీపీ అంటే ఏంటో దేశానికి తెలియజేస్తాం : చంద్రబాబు

తిరుమల వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో ఒక్క కేంద్రానికే కాదు దేశం యావత్‌కు

వెంకన్న సాక్షిగా దీక్ష .. టీడీపీ అంటే ఏంటో దేశానికి తెలియజేస్తాం : చంద్రబాబు
, శనివారం, 14 ఏప్రియల్ 2018 (15:59 IST)
తిరుమల వెంకన్న సాక్షిగా ఈనెల 20వ తేదీన దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో ఒక్క కేంద్రానికే కాదు దేశం యావత్‌కు తెలియజేస్తామని ఆయన అన్నారు.
 
అంబేద్కర్ 127వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, తన పుట్టినరోజైన ఏప్రిల్ 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష సాగుతుందన్నారు. 
 
పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాహారదీక్ష చేశారని... పార్లమెంట్ జరగకపోవడానికి కారణం మీదే (బీజేపీ) కదా అని ఆయనను తాను అడుగున్నానని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని... తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. 
 
ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని... ఢిల్లీలో చక్రం తిప్పుతామని ఆయన జోస్యం చెప్పారు. 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే... ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. పైగా, తన దీక్ష ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటో యావత్ దేశానికి చూపుదామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెన్సేషన్ కోసం కాదు.. న్యాయం కోసం పోరాడాలి : శ్రీరెడ్డి వ్యవహారంపై పవన్ కామెంట్స్