Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనందయ్య మందుకు పర్మిషన్, కానీ కరోనా తగ్గుతుందని చెప్పలేం

ఆనందయ్య మందుకు పర్మిషన్, కానీ కరోనా తగ్గుతుందని చెప్పలేం
, సోమవారం, 31 మే 2021 (14:01 IST)
ఎట్టకేలకు ఆనందయ్య మందుకు ఏపీలో పర్మిషన్ లభించింది. ఐతే ఆనందయ్య మందు తీసుకుంటే కరోనావైరస్ తప్పకుండా తగ్గిపోతుందని చెప్పేందుకు ఎలాంటి నివేదిక లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆనందయ్య మందు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వుండవని తెలిపింది.
 
ఈ మందును ఎవరి ఇష్టానుసారం వారు వాడుకోవచ్చనీ, ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ అనుమతులను సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ఇస్తున్నట్లు తెలిపింది.
 
కాగా ఆనందయ్య మందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ దానివల్ల కరోనావైరస్ తగ్గుతుందా లేదా అనే అనుమానం వుండటంతో దీనిని ఎంతమేరకు ప్రజలు వాడుతారో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కర్ఫ్యూ పొడగింపు.. మార్పులు లేని సడలింపు వేళలు