Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియదర్శన్-లిజి విడాకులు: కలిసివుండలేమని నిర్ణయం!

Advertiesment
Priyadarshan director Lissy heroine  Mollywood Chennai family court divorce
, బుధవారం, 3 డిశెంబరు 2014 (14:37 IST)
ప్రముఖ మలయాళ, హిందీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిజి పద్దెనిమిదేళ్ళ వైవాహిక జీవితం ముగిసింది. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
విడాకుల కోసం ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ఆయన భార్య లిజిలు చెన్నై కోర్టును ఆశ్రయించారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇకపై కలిసివుండలేమని అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలని వారు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని లిజి ఒక ప్రకటనలో తెలిపింది. 
 
1996లో ప్రేమ వివాహం చేసుకున్న లిజి, ప్రియదర్శన్‌కు కల్యాణి, సిద్ధార్థ్ అనే పిల్లలున్నారు, వారిద్దరూ విదేశాల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కాగా, తమ ఎడబాటు గురించి తమ పిల్లలు, సన్నిహితులకు తెలుసని ఆమె స్పష్టం చేశారు. తమ జీవితంలో ఇది అత్యంత క్లిష్ట సమయమని పేర్కొన్నారు. అందువల్ల తమ ఏకాంతాన్ని గౌరవించాలని ఆమె మీడియాను కోరారు. 
 
ప్రియదర్శన్, లిజి దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని, వారు విడిపోనున్నారని గతంలో మీడియా వార్తలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వారి వైవాహిక జీవితంపై ఎన్నో కథనాలు మీడియా ప్రసారం చేసింది. అప్పట్లో కమల్ హాసన్ - గౌతమి, మోహన్ లాల్ - ఆయన భార్య చొరవతో కొన్నాళ్ల పాటు కలిసున్న వీరు ఎట్టకేలకు విడిపోవాలని మరోమారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu