Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి సేవలను నిర్వహించడంలో పురుషులదే పైచేయి.... ఐతే స్వర్థరథం ఊరేగింపు మాత్రం...

Advertiesment
శ్రీవారి సేవలను నిర్వహించడంలో పురుషులదే పైచేయి.... ఐతే స్వర్థరథం ఊరేగింపు మాత్రం...
, సోమవారం, 21 సెప్టెంబరు 2015 (15:03 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవరోజు సాయంత్రం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై, బంగారు రథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఊంజలసేవకు బదులుగా స్వామి, అమ్మవార్లను ఆలయంలోని రంగనాయకుల మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. వసంతోత్సవం తరువాత జరిగే స్వర్ణ రథోత్సవాన్ని సువర్ణ రథ డోలోత్సవమని పిలుస్తారు. బంగారు రథానికి కళ్యాణకట్ట మిరాశీదారులు సమర్పించే బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు.
 
అనంతరం సర్వాలంకారభూషితుడైన స్వామివారిని బంగారు రథంపై కొలువుదీర్చి సాయంసంధ్య సమయంలో అరుణకిరణ కాంతులు రథంపై  పడుతుండగా వాహన సేవను ప్రారంభిస్తారు. ఈ రథంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూసేందుకు వెయ్యి కళ్లయినా సరిపోవు. శైబ్య , సుగ్రీవ, మేఘపుష్ప, వలాహాక అనే నాలుగు గుర్రాల స్వర్ణరథంపై స్వామి వారు విహరిస్తారు. శ్రీవారి వాహన సేవలలో స్వర్ణరథం ఒక ప్రత్యేకమైన విశేషాన్ని కలిగివుటుంది.
 
స్వామి వారి అన్ని సేవలను నిర్వహించడంలో పురుషులదే పైచేయి అయినప్పటికి తన భక్తుర్రాండ్రయిన మహిళలకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పడమే స్వర్ణరథ ప్రత్యేకత.

Share this Story:

Follow Webdunia telugu